Sunday, June 19, 2011

హుస్సేన్‌సాబ్ మనకిచ్చిందేంటి... మనం చూసేదేంటి?

 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi95lvN5IOdKpvVqhbMe7aMJ0Zzj5H195blK61yjViJ_MRgL-BKWfLqkOh471iSWiwHuXUFNDZC44Vsc0fAD3cWGNnf-2oVcVld33GRn0QH9QttqIfMWK6M62nHpiBNAq58NPH9RJ6NtM4/s320/MF+Hussain.jpg
 మన దేశానికి స్వతంత్రం వచ్చిన ఏడాదే యంగ్ ఎం.ఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌కి బహుమతి వచ్చింది. అది మొదటి గుర్తింపు. దానికి ముందు రెండు దశాబ్దాలకు పైగానే ఆయన భారతదేశాన్ని చూశాడు. దాని చరిత్రనూ, రామాయణ మహాభారతాలనూ చదివాడు. చిత్రకళా రీతుల్నీ అర్థం చేసుకున్నాడు. స్వతంత్రం కోసం ఉవ్వెత్తున పడి లేస్తున్న ఉద్యమాన్నీ గుండెలకి హత్తుకున్నాడు. చిత్రకారుడిగా గుర్తింపు పొందడానికి ముందు, ఎం.ఎఫ్ హుస్సేన్ అనే ఒక వ్యక్తిత్వం, ఆలోచన, అవగాహన రావడానికి అంతకుముందున్న ఈ అనుభవాలు, ప్రభావాలే దారితీశాయి. ఆయన బొమ్మల్నీ, బతుకునీ చూడ్డానికీ, ఫీలవడానికీ ఇవి ఎంతో పనికొస్తాయి.

ఒకనాడు- గాంధీ నెహ్రూల నాయకత్వంలో దేశమంతా ఒక్కటై బ్రిటిష్ వాళ్లని 'క్విట్' అని నినదించి పొమ్మంటున్నారు. భగత్‌సింగ్ త్యాగంతో దేశంలో అగ్గి రేగింది. రష్యన్ విప్లవ ప్రభావం అందరిమీదా ఉంది. కమ్యూనిస్టు నాయకుడు పి.సి. జోషి ఇన్‌స్పిరేషన్‌తో కవులూ కళాకారులూ 'ఇప్టా' (ప్రజానాట్యమండలి) ప్రారంభించారు. దానికి బలరాజ్ సహానీ, పృధ్వీరాజ్ కపూర్ లాంటి నటులెంతో మంది గొప్ప నాయకత్వమిచ్చారు. బెంగాల్ కరువు కోసం హేమంత్ కుమార్ గొంతెత్తి పాడి, హార్మోనియం వాయిస్తే కలకత్తా వీధుల్లో వేనకువేల జనం వెంట వచ్చి విరాళాలిచ్చారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌కు బాగా తెలిసిన మఖ్దుం మొహియుద్దీన్ కవిత కట్టలు తెంచుకుంటోంది.
http://ritu037.files.wordpress.com/2011/06/contact20main20400x350.jpg
ప్రేమ్‌చంద్ అధ్యక్షతన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ మొదలయింది. మనదేశం ఈ నాటికీ గొప్పగా చెప్పుకునే రచయితలూ, కవులంతా ఇందులో చేరారు. వీళ్ల కవితలూ పాటలూ ప్రదర్శనలూ దేశాన్ని ఓ కుదుపు కుదిపాయి.

చివరిగా స్వతంత్రం వచ్చిన సంవత్సరంలోనే ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏర్పడింది. దీన్ని ముందుండి నడిపించింది ఫ్రాన్సిస్ న్యూటన్ డిసౌజా (గోవా). మనిషి తెంపరి. మాట దూకుడు. స్టార్ ఎట్రాక్షన్ లాగేస్తుంది. బొమ్మలూ అంతే. హుస్సేన్, రజా ఆయనకంటే చిన్నవాళ్లు. అప్పటి పదిహేడు మంది గ్రూప్ ఫొటో చూస్తే ముచ్చటేస్తుంది. అందరూ చాలా చిన్నవాళ్లు. మొహాల్లో ఎంతో అమాయకత్వం, ఏదో దీక్ష వెలుగుతూంటాయి.

వీళ్లీ సంఘం పెట్టే నాటికి చిత్రకళలో బ్రిటిష్, యూరోపియన్ ఆర్టిస్టుల ప్రభావం రాజ్యమేలుతోంది. తూర్పున 'బెంగాలీ స్కూల్' ఉధృతంగా ఉంది. నందలాల్ బోస్, అయినీంద్రనాథ ఠాగూర్, రవీంద్రుడి చిత్రాల వరసంతా ఒకటి. వైశ్రాయ్‌లు, తెల్లదొరల పోర్‌ట్రెయిట్‌లు, లాండ్‌స్కేప్‌లు గీసి పేరూ డబ్బూ గడించిన జామిని రాయ్ అవన్నీ ఒదిలేసి ఊరెళ్లిపోయి ఐదారు చిక్కని రంగులూ పెద్ద గీతలకూ సెటిలయ్యాడు. గ్రెకో రోమన్ ఆర్ట్‌కి నకలుగా వెలిసిన రాజా రవివర్మ స్టైల్ వెనక్కి తగ్గింది. హంగరీ పంజాబీ తల్లిదండ్రులకు పుట్టిన అమృతా షేర్ గిల్ పారిస్ వెళ్లి ఇంప్రెషనిస్టుల్తో కలిసి తిరిగి బొమ్మలేసినా, ఇండియా తిరిగి వచ్చాక తనదైన భారతీయ శైలిని బొమ్మల్లో చూపింది. మద్రాస్‌లో రాయ్ చౌధురీ గారిది యూరోపియన్ స్టైలే.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhe94OBne5izQIlZ_qkDSWYxpEdk6VGybGnjhOYR9rH-e1e4mEtPL2BJ_VBVCwIP_V9hyphenhyphenC2diEtsTw5_oXKaCFoBTsMnx27Tm3s1PAXhV1HIm8vj7MBtmGabg9MK9z98qD1-Q_KRr_NjgQ-/s400/image003.jpg
ఇవేవీ కాని, మరో విలక్షణమైన, సొంత భారతీయమైన శైలి కోసం ఉద్యమం తేవాలనే ప్రొగ్రెసివ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వచ్చింది. ఇందులో అందరూ ఇలాగే గీయాలి, అలా గీయకూడదనే బండ రూల్సేమీ లేవు. ఎవరి దారిని వాళ్లు కనుక్కునే స్వేచ్ఛ పూర్తిగా ఉంది. నిజానికి మన భారతీయ కళకు పునరుజ్జీవ కాలమది. ఆ కాలం కన్నబిడ్డలే డిసౌజా, హుస్సేన్, రజా ఇంకెందరో. అందరిమీదా యూరప్ ప్రభావం ఉన్నప్పటికీ భారతీయమైన దానికోసం వెదుక్కున్నారు.http://liberallifestyles.com/wp-content/uploads/2011/06/MFhusain1998.jpg
మన ప్రకృతీ, మన పండగలూ రంగులూ, మన కల్చర్ గీసిన గీతల్ని అందుకున్నారు. హుస్సేన్ అయితే మరీ. స్వతంత్ర పోరాట ఘట్టాలెన్నిటినో 'సీరీస్'గా గీశాడు. ఢిల్లీలోని రాజీవ్ సెంటర్‌లో మూడంతస్థుల పొడుగునా వేలాడదీసిన పెద్ద కేన్వాసుల్ని ఇప్పటికీ మనం చూడొచ్చు. ఆయన గుర్రాలు గానీ అమ్మాయిలు గానీ చెట్టూ పుట్టా రాయీ రప్పా ఏది గీసినా రేఖా చిత్రాల్లాగే ఉంటాయి. ఆయిల్ పెయింటింగ్ అనగానే మనందరికీ మనస్సుల్లో ముందుగా 'ఫిక్స్' అయిన రంగుల మిశ్రమం అందులో కనిపించదు. ముదురు రంగులూ, బండగా బయటి గీతలూ ఉంటాయి. ఇది హుస్సేన్ ముద్ర. ఇలాటివి ఆయన వేలకు వేలు గీశాడు.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjXMfVBzKONKDdRFuDSzpbYH4bGMHsj9PqEtE7IVkEaXSkMexsUXI3UlGWaXFqpW0ElRG8jfgysw8-khiqYr98GspkPvXhvO9g2ECSawIZ7RVdO-AgyKtf-9Ip7KlTLW8KUcJ-TnBUmVoxs/s400/main2.jpg
70 ఏళ్ల కళాసృష్టిలో ఆయన ఫలానా థీమ్ మాత్రమే గీశాడని చెప్పలేం. గుర్రాలు గీసిన కాలం. మానవ శరీరాకృతుల్ని గీసిన కాలం. గాంధి, నెహ్రూ, ఇందిరాగాంధి, మదర్ థెరిసా వంటి ప్రముఖుల్ని గీసిన కాలం. హైదరాబాద్‌లో బద్రి విశాల్ పిట్టి ఇంట్లో ఉండే కాలంలో చెక్కబొమ్మల్ని చెక్కిన కాలం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో బొమ్మలు రూపొందించిన కాలం. ఇలా ఒక దాన్నించి ఒకటి మారుతూ వెళ్లాడు. సమకాలీన రాజకీయాలపై కూడా అనేకం వేశాడు. అందులో అవినీతిపై వేసింది కూడా ఉంది.

అన్నిటినీ అందరూ చూడ్డం అసాధ్యం. కానీ సాధ్యమైనన్ని చూడడం, ఫీలవడం తర్వాత తరాలకివ్వడం మనం చేయాలి. ఆ రంగులు గీతల ధ్యాసలో పడి ధ్యానంలోకెళ్లి కాన్వాసులో కలవాలి తప్ప ఫ్రేము కింద దాని రేటునే చూసి అదే పనిగా అబ్బురపడిపోడం ఆపాలి.

గ్రేటెస్ట్ ఎవరో?

ఇరవయ్యేళ్ళ నాటి మాట. న్యూయార్క్ నుంచి ఫ్రాన్సిస్ న్యూటన్ డిసౌజా వచ్చాడు. అప్పటి ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఎడిటర్ ప్రితీష్ నంది ఇంటర్వ్యూ చేశాడు.
డిసౌజా అంటే మాటలు కాదు. బోల్డన్ని మాటలు కూడా. హుస్సేన్ లాంటి వాళ్లకంటే చాలా ముందువాడు. ప్రపంచంలో పేరున్న ఆర్టిస్టు. మన గోవా బిడ్డడు. ఎవ్వర్నీ లెక్కచేసే బాపతు కాదు. అనుకుంటే ఎంత మాటైనా అనేస్తాడు. ఎంత గొప్ప ఆర్టిస్టో అంత లోతైన విమర్శకుడు.
http://1.bp.blogspot.com/-jZgsjJXAJIg/TfER2U6oH8I/AAAAAAAAGqg/TpL9Aqsm73E/s400/mf%2Bhussain%2Bpainting.jpg
ఆర్.కె. లక్ష్మణ్ వేసే కాకుల మీద మీ అభిప్రాయం అనడిగితే అవి ఇండియన్ ఆర్ట్‌కి దిష్టిబొమ్మలన్నాడు. ఇంకా ఇలాంటి వైల్డ్ కామెంట్స్ అయింతర్వాత: "ఈ భూ పెపంచకంలో ఇప్పుడున్న గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఎవరనుకుంటున్నారు?'' అనడిగితే తడుముకోకుండా "ఇప్పుడెలాగూ పికాసో చచ్చిపోయాడు గనక ప్రపంచంలోకెల్లా గొప్ప ఆర్టిస్టుని నేనే'' అన్నాడు.
తర్వాత కొంతకాలానికి న్యూయార్క్‌లో డిసౌజా చనిపోయాడు. అప్పట్నుంచి హుస్సేన్ సాబే గ్రేటెస్ట్ అని మేము ఫిక్సయిపోయాం.

అప్పుడేమో-మరే

క్కన్ క్రానికల్ ఫోటోగ్రాఫర్‌లకి బాగా లోకువ ఎవరంటే హుస్సేనే. ఈయన కుదురుగా బంజారా హిల్స్‌లో బొమ్మలేసుకోకుండా బండి కట్టుకుని 'ఊ' అంటే సికింద్రాబాద్ పోయేవాడు. అక్కడ ఎన్నెన్ని ఫైవ్‌స్టార్ బార్లున్నాయి. అయినా పోయేవాడు కాదు. క్లాక్ టవర్ చౌరాస్తాలో గార్డెన్ రెస్టారెంట్ అనే పరమ పాత ఇరానీ హోటల్‌కెళ్ళేవాడు. ఆ పక్కనే క్రానికల్, భూమి ఆఫీసులుంటాయి. ఎదురుగా ఖరీదైన బసేరా హోటలుంటుంది. దాని అద్దాల తలుపుల మీద ప్రఖ్యాత జెకోస్లవాక్ పెయింటర్ ఒక నాటకంలో హీరోయిన్ ఎవర్నో మర్డర్ చేసి కత్తి పైకిలాగే ఎచింగ్ ఉంటుంది (ఆ పెయింటరూ, ఆవిడ పేర్లు తెలుసుగానీ అభీ గుర్తు నహీ హై). అవి చూడ్డానికైనా హుస్సేన్ అక్కడికెళ్ళడు. గార్డెన్ రెస్టారెంట్‌లోనే ఆటోడ్రైవర్ల, గుమాస్తాల గుంపులో కూచుని చాయ్ తాగుతుంటాడు. క్రానికల్ నుంచి వచ్చిన ఏ సబెడిటరో చూసి ఆఫీసుకెళ్లి హుస్సేన్ ఉన్నాడని చెప్పగానే ఫోటోగ్రాఫర్లు తయారు. మర్నాడు మొదటి పేజీలో పెద్ద ఫోటో. అలా వాళ్లెన్నిసార్లు వేశారో లెక్కలేదు.http://www.calcuttaweb.com/art/img/mfhussain3.jpg
అలా ఒకరోజు ఫోటో చూసి "గురూ హుస్సేన్ కమ్స్ టు టౌన్'' అని అందరికీ ఊదాను. వెళ్దామా అన్నారు. వెళ్దాం అనుకున్నాం. మాలాగే పలువురు ముక్కూ మొహం లేని చిత్రకారులందరికీ ఫోన్‌లు కొట్టాం. బిలబిలమంటూ అంతా పోగై 'సినిమా ఘర్'కి వెళ్లాం. ఓ ఇరవై మంది ఉంటామేమో. ఆ భవంతి పూర్తిగా కట్టడానికింకో రెండేళ్లు పట్టేట్టుంది. ఒట్టి సిమెంట్ స్కెలిటన్ ఉంది. లేని, కట్టని గేట్ దగ్గర వాచ్‌మన్ కోసం చూస్తుంటే హుస్సేన్ అంత పొడుగూ, అలాటి తెల్లజుట్టూ గల విగ్రహం కనిపించింది. "సార్ రావడానికో అరగంట పట్టొచ్చు వెయిట్ చేయండి'' అన్నాడు ఆయన.http://www.fakingnews.com/wp-content/uploads/2010/03/M_F_Husain.jpg
ఆయన హుస్సేన్ సాబ్ పెద్దకొడుకు. రోడ్డుకవతల చెట్టుకింద టీ బండి వాడి దగ్గర కూచున్నాం. మా రైటరూ, క్రిటిక్కూ అయిన శివాజీ, ఆర్టిస్టులు రాజు, బ్రహ్మం, ఆంజనేయులు, అక్బర్, శంకర్, అన్వర్, శ్రీరామ్ ఇంకా చాలామందిమున్నాం. ఈలోగా కవయిత్రి శైలజ వచ్చేసింది. ఇంకా జనం చేరారు. అదిగో రానే వచ్చాడాయన. పొలోమంటూ పోయాం. ఆయన వాచీ వంక చూసుకుని "యు సీ ఐ హేవ్ నో టైమ్ టు టాక్ టు సచె క్రౌడ్. ఐ హేవ్ గాట్ సమ్ అర్జంట్ బిజినెస్ టు అటెండ్'' అంటే ఎలా? డైలమా. "పిల్ల కాకులు మీతో నాకేంటి బే'' అంటే అప్పుడెలా? ఏమో. తీరా పలకరిస్తే ఏ గుడ్డూ లేదు. నాతో రండన్నాడు. ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లేముందు సినిమాఘర్‌లో ఏమేం చేద్దామనుకుంటున్నాడో చెప్పాడు. ఇక్కడ లైబ్రరీ, అక్కడ థియేటర్. పైన స్టుడియో, వర్క్‌షాప్‌ల హాల్. మీరంతా రెగ్యులర్‌గా రండి. ఇక్కడే బొమ్మలేసుకోండి. సినిమాలు చూడండి. సెమినార్లు పెట్టుకోండి. మన ఆర్ట్ గురించి చర్చించండి. నిజానికిది మీదే. ఎప్పుడూ నేనుండాలనేం లేదు. మీకు మీరే ఏదొకటనుకుని అది ఇక్కడే చేసుకోండి అని చెప్పుకుపోతున్నాడు. https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhwQlCsLa-VLSUMba-7vxo5Ykbc9Kl6S1li6aIYYP_rSgLgBnow7lkDogrUvL94XJnETlN5d6iW_DTdC5G5-4ZGai8WbBSslZevpl_13qNDAU_6h5e5mXPSccL_UDrAWr5XiofAl1G4SXco/s1600/950298389b684fd790af29bb378190aa.jpg
చిన్నాపెద్దా లేదు. కొత్తాపాతా లేదు. నేను మెగా, మీరు మినీ అనే స్టార్ టాన్‌ట్రమ్స్ లేవు. ఫస్ట్ ఫ్లోర్‌లో బయట ఎండలో చుట్టూ చేరాం. ఇండియన్ ఆర్ట్, మీరూ మరేంటి సంగతన్నాం. ఇండియా అంటే పండగ అన్నాడు. ఇక్కడంతా ప్రతిరోజూ, ప్రతిదీ సెలబ్రేషనేనని చెప్పాడు. బాట పక్కన పచ్చని చెట్లూ, గడ్డీ, విరబూసిన పూలకింద పెద్ద రాయికి హనుమంతుడి ఎర్రరంగు పూసి ఉంటుంది. ఈ రంగులే ఇండియా. ఇదే మీ బొమ్మలకి సోర్స్ అన్నాడు. మన జానపదుల్లో, గిరిజనుల్లో మన కళను వెదుక్కోండి. అవే మన రంగులు. అవే మన పండగ. మీరు కొత్తగా ఏమీ కనిపెట్టక్కర్లేదు. అవి చూడండి. వేయండి. చాలు అంటున్నాడు. నాలుగ్గంటల పాటు మేం అడగడం, ఆయన చెప్పడం. చిన్నప్పుడు ఆయన బంధువులున్న పాతబస్తీలో తిరగడం, ఇక్కడి వీధులు, చార్మినార్, లాడ్ బజార్, బొంబాయి వెళ్లి సినిమా బేనర్ పెయింటింగ్ చేయడం చాలా చెప్పాడు.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjiXNCsiNKdmSzRokgCsdKZZJ1mCSvezpAEyhAaXiLM1t7QCwWZOC-mZIDMr15CeTVUAqpFWCLaAb_jFz52pOifL5GyMGDbktBdax5tEPB8Lq7JIsy_V21bxVssnRpE7evAlp0bBOAs_J4/s640/left+eye.jpg
అంధేరీ గదిలో చిత్తప్రసాద్‌తో చిన్న గదిలో ఉండి బ్లాక్ టీలే తిండిగా బతికిన కాలం గురించి అడిగితే చిత్తప్రసాద్ డ్రాయింగ్స్, పప్పెట్స్ గురించి చాలా చెప్పాడు. ఆయన బొమ్మని ఆయన స్టైల్‌లోనే గీసిన నా డ్రాయింగ్ మీద సంతకం పెడుతూ "నన్ను రవీంద్రనా«థ్ ఠాగూర్‌ని చేశావుగా'' అన్నాడు. మరి "మీరు అదే గదా'' అంటే పువ్వులా నవ్వాడు. మా ఆర్టిస్టులంతా అప్పటికప్పుడు గీసిన కేరికేచర్ల మీద అదేపనిగా ఆటోగ్రాఫ్‌లిస్తున్నాడు. "ఒరేయ్ నా సంతకం రేటు కోటిరా. నేను కింగునిరా మీ ముష్టి బొమ్మల మీద సంతకం చేసే ముదనష్టం వాళ్ళా కనిపిస్తున్నాన్రా'' అనడం లేదు.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhYlzcIamBBB89RLYnx73HKQqry-2LW71vE7a0NJwhKvhY6xfMH2jg1vOB62Mf7SPme78tMZ0LimHOK-5n2DJlK3fSXbUlsvN7B7Qvcu4aUGmn5zr5MDeMCN3prjtN1Ue2A6UNBkDOQoTc/s1600/Husain_Sitar_lg.jpg
పదండి పైకెళ్దాం అన్నాడు. సెకండ్, థర్డ్ ఫ్లోర్‌లకు మెట్లమీద చెంగు చెంగున ఎగిరి దూకుతున్నాడు. వెనక మా చిల్లర గుంపు. ఒక్కో మెట్టుమీద ఆయన కాలు పడుతుంటే వెనక ఆయన పైజమా పైకి లేచి కాలి పిక్కలు పసుప్పచ్చగా బలంగా కనిపించాయి. మాకు ఆయాసాలొచ్చాయి గానీ ఆయన దర్జాగా వెళ్తున్నాడు. పైన మూడో ఫ్లోర్లో మన చిరంజీవి, బాలకృష్ణలకు వేసే హోర్డింగ్‌లంతటి కేన్వాసులు. ఫ్రేముల్లేనివి. అవి హుస్సేన్‌కంటే రెండింతలు పొడుగున్నాయి. అంత బరువు మోయడం మాలాటి వాళ్ళకి జరిగే పనికాదు. ఆయన మాత్రం చులాగ్గా ఎత్తేసి దాన్ని పేద్ద హాలంతా రోల్ చేసి, ఆ బొమ్మలన్నిటి వివరాలూ చెప్తున్నాడు. మీ ఇంట్లో చిన్న పిల్లలు రెండుకొండలూ, సూర్యుడూ, చెట్టూ, ఇల్లూ వేసి ఎలా చెప్తారో అచ్చం అట్లాగే. అంతకుముందు రోజే ఆయన బొమ్మలు మొదలెట్టినట్టూ, అది మాకు పిల్లాడిలా చూపిస్తున్నట్టూ ఉంది. ఇంత అమాయక వెర్రిబాలుడితో వేగటమెట్లాగా అనిపించింది. ఈతడి స్వీప్ అసాధ్యమనీ అనిపించింది.

మామూలుగా పత్రికల వాళ్లూ, ఏ సబ్జెక్ట్‌లోనూ ఎలాటి లోతూలేని విలేకరులూ అడిగే స్టాక్ కొశ్చెన్స్ కొన్ని ఉంటాయి. మీరీ వృత్తిలోకెలాగొచ్చారు? మీ విజయ రహస్యమేంటి? యువతరానికి మీరిచ్చే సందేశమేంటి? ఇలాంటివి ఎవరినైనా, ఎప్పుడైనా, ఎన్నైనా అడగొచ్చు. అచ్చం మేం గూడా అంతే మూర్ఖంగా, బోలుగా అడిగాం.
ఆయనన్నాడు : "ఈ ఫీల్డ్‌లోకి చాలామంది ఫాన్సీతో వస్తారు. నిజానికి దారి తప్పి వస్తారు. అందులో తొంభై శాతం, గట్టిగా చెప్పాలంటే తొంభై తొమ్మిది శాతం ఆర్టిస్టులు కారు. ఎవరో ఒకరిద్దరో ఇంకా కొద్దిమందో ఆర్టిస్టులు కాగలుగుతారు. మిగతా వాళ్లంతా ఆర్టిస్టులు కారు'' అన్నాడు. వీళ్లంతా "రనాఫ్ ది మిల్'' అని చెప్పాడు.
గుండె గుభిల్లంది. మేం దారి తప్పిన గొర్రెలమా? రనాఫ్ ది మిల్ గాళ్ళమా? మమ్మల్ని రక్షించే ఏసుక్రీస్తు ఏడోసారి పునరుత్థానము చెందునా. తెల్వది.

పనికిమాలిన పక్కచూపు

మనవాడు, మహానుభావుడు దేశం గాని దేశంలో పండుటాకులా రాలిపోయాడు. అతను మనకిచ్చిన కళను తలచుకుందాం. ఈ సంపదను దాచుకుందాం. చూసుకుందాం... అనుకోవాల్సిన సమయంలో మన ఛానల్స్, పత్రికల్ని చూస్తే బెంగేస్తుంది. ఆయన మరణం గురించి నాలుగు ముక్కలు రాసీ, చెప్పక ముందే మాధురీ దీక్షిత్ పేరూ 'గజగామిని' సినిమా ముందుకు తీసుకొచ్చేస్తాయి. అంతలో టబు, అనుష్క శర్మ, అమృతారావ్, విద్యాబాలన్ పేర్లొచ్చేస్తాయి. వాళ్ళతో ఆయన ఉన్న క్లిప్పింగ్స్ బుల్లితెర మీద కదుల్తాయి. లేదా లండన్ క్రిస్టీస్‌లో మొన్ననే ఒక సెట్టు ఆయిల్స్ ఫలానా ఇన్ని కోట్లకు పోయిందిట గురూ అని ఒకడు. మరి ఎస్.హెచ్. రజా బొమ్మలెంతకి పలికాయి? ఈ రేటు హుస్సేన్ కంటే ఎక్కువా? త్యాబ్ మెహతా కంటే తక్కువా? అంటాడింకొకడు. చెప్పులెందుకేసుకోడో! ఒకసారి చాలా పెద్ద ఫంక్షన్‌లోకి బూట్లు లేవని రానివ్వకపోతే వెనక్కి తిరిగెళ్లాడట. తెల్సా అని మరొకడు. ఇరానీ చాయ్‌లోకి ఉస్మానియా బిస్కెట్ ముంచితే గానీ ్ఠ్టగొంతు దిగదటగా అని ఇలా ఎన్నెన్నో.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhk0kiIPY6GbrSQ-ZnFAO9QNXVcQ7Fl2ffalpuHBKx4Zy2Xevc7camdsv6PIYKSlcI-iQI4ZPP7CkPenTm3dsGHH_xxFvGNkEfaDAblz5ndOy5txHP39nsn9mbpQsPWLsAMDXRn2D3XKKvm/s400/image002.jpg
మాధురీ దీక్షిత్తో మరొకళ్లో గొప్ప నటీమణులు కావచ్చు. నిజం కూడా. చాందినీబార్ సినిమాలో టబు అద్భుతమైన నటన చూసినపుడు ఇంత గొప్ప ఆర్టిస్టుని మన సినిమాల్లో బొడ్డు చూపి నడుం ఊగించే ఆడ మాంసంగా చూపిస్తారేమని బాధ ముంచుకొచ్చేస్తుంది. హుస్సేన్ కళ గురించి తలచుకోవాల్సిన టైమ్‌లో ఆ పని మానేసి టబును తలచుకోడమంటే ఆవిడ గొప్ప కళకి జరిగిన అన్యాయాన్నే మనం హుస్సేన్‌కి చేస్తున్నామని లెక్క. చాలామంది కళాకారులకి ఈ అన్యాయం జరిగింది. పికాసో పెయింటింగ్‌లూ, శిల్పులూ, రాతలూ చూడ్డం, మాట్లాడితే వినడం మానేసి ఆయన పన్నెండు మంది పెళ్లాల్ని మార్చాడని చెప్పుకున్నాం. అలాంటి హాలీవుడ్ సినిమాలనే చూశాం. విన్సెంట్ వాంగో చెవికోసుకున్నాడనీ, చెయ్యి కాల్చుకున్నాడనీ మాట్లాడుకోడం తప్ప అతని పెన్సిల్ డ్రాయింగ్‌లు, పెయింటింగ్‌లు చూడ్డానికి టైమెక్కడిది. మహా అయితే మొన్నే యూరప్‌లో 'సన్‌ఫ్లవర్స్' ఇన్ని కోట్లకు వేలంలో పోయిందట. ఇది రికార్డు రేటంట అని చెప్పుకుంటాం.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiXGkA_51-OUcgrCvCDMefMCgFqZb4Ykg87KYzdf5XztLSXIVeKWRJHIUMdKYDVOquTZdTb8RAvtgynxlvzV3KgTp7YxmQLH6PiFQuu78H746X033hbac4-vEBmNrw3zowJm86s_tGXY0l2/s400/image008.jpg
"ఐ ఫూల్డ్ ఒన్ హండ్రెడ్ మిలియనీర్స్'' అని పికాసో ఎప్పుడో చెప్పిన విషయాన్ని మేం తలచుకున్న మర్నాడే శివసేన బాల్‌థాకరే ఆ కొటేషన్‌ని జర్నలిస్టులకు గుర్తు చేశాడు. ఏమో హుస్సేన్ కూడా అలా చేశాడేమో మనకేం తెలుసు. మనం 'ఆర్ట్' అనే దాన్ని వదిలేసి అడ్డమైన వాటిని పట్టుకు వేళ్ళాడ్డం ఇకనైనా మానెయ్యాలి. పనికి మాలిన పక్కచూపుల వల్ల అసలు సంగతి ఆవిరై పోతుంది.
................................................
* మోహన్
77028 41384

Tuesday, May 31, 2011

అమృతమూర్తి

అమృతమూర్తి

16 ఏళ్ల ప్రాయంలో గాంధీ స్ఫూర్తిని అణువణువునా నింపుకున్న డాక్టర్ నీలం సంజీవరెడ్డి తుదిశ్వాస వరకూ ఆయన సిద్ధాంతాలను అనుసరించారు. నేడు నీలం సంజీవరెడ్డి వర్థంతి సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు డాక్టర్ కె.వి.కృష్ణకుమారి.
అయిదు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం మాది. నా పసిమనసును పెంచి పెద్ద చేసి, అనంతంగా ప్రేమ, ఆప్యాయతలు పంచిన అమృతమూర్తులు, ఓ రకంగా నా పెంపుడు తల్లిదండ్రులు డాక్టర్ నీలం సంజీవరెడ్డి దంపతులు. మా నాన్నగారు కాజ జగన్నాథరావు, సంజీవరెడ్డి అంకుల్ ప్రాణస్నేహితులు. ఆయన ఎప్పుడు తెనాలి వచ్చినా మా ఇంటికి రాకుండా, అమ్మచేతి వంట తినకుండా వెళ్లేవారు కాదు. 1962లో ముఖ్యమంత్రి హోదాని, ప్రొటోకాల్‌ని పక్కన పెట్టి, నాన్నతో పాటు నడుచుకుంటూ వచ్చి, రంగరాయ మెడికల్ కాలే జీలో నన్ను చేర్పించారు. మా కృష్ణ మంచి డాక్టరై మీకే కాదు..

నాకు కూడా మంచి పేరు తెచ్చిపెడుతుంది అని కాలేజీ యాజమాన్యంతో అంటున్నప్పుడు అంకుల్ కళ్లలో కనిపించి వాత్సల్యం నిండిన వెలుగును నేను ఇన్నేళ్ల తరువాత కూడా మరచిపోలేను. కేంద్ర మంత్రిగా ఎన్నో పనుల్లో ఉన్నా ఢిల్లీ నుంచి నాకు స్టెతస్కోప్ పంపి ఆశీర్వదించారు. చిన్నవయసులోనే నాన్న నన్ను అన్యాయం చేసి వెళ్లిపోయినప్పుడు కొండంత అండగా నిలిచిన ఆత్మబంధువు సంజీవరెడ్డి అంకుల్. గుంటూరులో జరిగిన ఎఐసిసి మీటింగ్‌లో శ్రీమతి ఇందిరాగాంధి, లాల్‌బహదూర్ శాస్త్రి, కామరాజ్ నాడార్‌లకు నన్ను తన నాలుగో కూతురుగా పరిచయం చేశారు.

ఆ రోజు తిరిగి రాదు!

1996 మే 19న ఎప్పటిలాగే అంకుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి బెంగుళూరు ఫోన్ చేశాను. ఈ సారి ఎందుకో నా గొంతువొణికింది. కళ్లు తొణికాయి. 'ఏమైంది కృష్ణా! నీ గొంతు ఎందుకు అదోలా వుంది? నువ్వు దూరంగా ఎక్కడ ఉన్నావ్? ఇక్కడ మాతో నువ్వు లేకపోతే కదా? ఈ హడావుడి అంతా అయ్యాక బెంగుళూరు వచ్చేయ్. కొన్నిరోజులు సరదాగా గడుపుదువుగాని...' అన్నారు అంకుల్ ప్రేమనిండిన గొంతుతో. ఆ ప్రేమకు నా కళ్లు వర్షించాయి. కానీ ఆ రోజు మళ్లీ తిరిగి రాదని నేను ఊహించలేకపోయాను. ఫుడ్‌పార్టికల్స్ లంగ్స్‌లోకి వె ళ్లడంతో అంకుల్‌ను అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్పించారు.

అయినా అంకుల్ కోలుకుంటారని, ఆప్యాయంతా నాతో మాట్లాడతారనే ఊహించాను. 1996 జూన్ 1న క్లినిక్ నుంచి ఇంటికి వచ్చి టి.వి. ఆన్ చేయబోయాను. అక్కయ్యా! రాత్రి బాగా పొద్దుపోయింది. ఇప్పుడు టి.వి. ఎందుకు? ముందు భోజనం చెయ్యి..అంటూ అడ్డుకున్నారు నా చెల్లెళ్లు... తమ్ముళ్లు. వాళ్ల చేతులు వదిలించుకొని..." ఇప్పుడు భోజనం ఏమిటీ? అవతల అంకుల్‌కు ఎలా ఉందో ఏమిటో'' అని ఆదుర్దాగా టీ.వీ ఆన్ చేశాను. కుప్పకూలిపోయాను.

నేను, డాక్టర్ డి.ఎల్.ఎన్. ప్రసాద్ బెంగుళూరు బయలుదేరాం. దేవుడు లేని గుడిలో అడుగుపెట్టాం. టి.వి. పక్కనే సోఫాలో నిండుగా కూర్చొని, ఆత్మీయంగా పలకరించే అంకుల్ ఏరి? నిర్మలక్క, నీరదక్క, అంకుర, డాక్టర్ సుధీర్, డాక్టర్ రమణ నన్ను అంటీ దగ్గరకు తీసుకెళ్లారు. ఆంటీ ఆ సమయంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకొని నాకు ధైర్యం చెబుతున్నట్టు, నా వీపు నిమురుతూ చాలా సేపు ఉండిపోయారు. అందరం కలిసి ఆ అమృతమూర్తికి కడసారి వీడ్కోలు పలికాం.

గాంధీ మళ్లీ పుట్టాలి

అంతకు ముందు కలిసినప్పుడు అంకుల్ నాతో అన్నమాటలు ఆ సమయంలో నాకు గుర్తొచ్చాయి. "కృష్ణా! మనుషుల్లో మానవత్వం నశించిపోతున్నది. స్వార్థం మితిమీరుతోంది. అధికారం కోసం ఆరాటం పెరిగింది. ఈ రక్తపాతాలు... చంపుకోవడాలు ఏమిటి? కోట్లకు కోట్లు సంపాదన కావాలి. అధికారం కావాలి. ఇలా అయితే దేశం ఏం కావాలి? ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడని ఈ సంపాదన ఎందుకు? గాంధీ వంటి నైతిక బలం ఉన్న నాయకుడు మళ్లీ పుట్టాలి'' దేశం చివరి శ్వాసలో సైతం ఆరాటపడిన మహనీయుడు మరిలేడు. దశాబ్దాల పాటు ఆయన తో కలిసి నడిచిన ఆంటీ ఎంతో నిబ్బరంగా కనిపించారు.

ఆమె పక్కన కూర్చోపెట్టుకొని నాతో ఇలా ఆన్నారు. " 1929లో గాంధీగారు అనంతపురం వచ్చినప్పుడు మీ అంకుల్ వయసు 16 ఏళ్లు సిల్కు దుస్తులు వేసుకొని గాంధీగారి ఉపన్యాసం విన్నారు. వేలాది మంది అభిమానులు గాంధీగారికి అక్కడ కానుకలు సమర్పించుకొనే వారు. ఆ వస్తువులను వేలం వేయగా వచ్చిన డబ్బును ఉద్యమానికి ఉపయోగించేవారు గాంధీ. ఆలా వేలంలో 16 రూపాయలు ఖర్చు పెట్టి ఒక వెండి బిస్కెట్ దక్కించుకున్నారు మీ అంకుల్. దాన్ని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారు.

ఆ రోజు నుంచీ ఖాదీ బట్టలు తప్ప మరేవీ కట్టలేదు. రాష్ట్రపతిగా కూడా అవే బట్టలు. రాష్ట్రపతి భవన్‌లో వందల గదులున్నా మా కోసం ఉంచుకున్నవి మూడు గదులే. నిజానికి రాష్ట్రపతి భవనంలో ఆయన బంగారు పంజరంలో ఉన్నట్లు ఉండేవారు. 70 ఏళ్లపాటు గాంధీ సిద్ధాంతాలను ప్రాణంగా భావించి, జీవించారు'' అంటూ కన్నీళ్ల మధ్య అంకుల్‌ను గుర్తుకు చేసుకున్నారు ఆంటీ. అంకుల్ ఎప్పుడూ నాతో అంటూ ఉండేవారు. "కృతజ్ఞత అనేది చాలా ముఖ్యం. అదిలేని వాడు మనిషే కాడు'' అని.

ఆయన భౌతికంగా దూరమైన రోజు నుంచీ ఏటా ఆయన వర్ధంతి సభలు నిర్వహిస్తున్నాను. దాంతో రుణం తీరుతుందని కాదు. ఆత్మ నిండుతుంది. అంతే. దేశం కోసం, రాష్ట్రం కోసం, రాయలసీమ కోసం ఎన్నో చేసిన డాక్టర్ నీలం సంజీవరెడ్డిని మనం సముచిత రీతిలో స్మరిస్తున్నామా అని ఆలోచించాలి. ఆయన జయంతి, వర్థంతులను ఘనంగా జరిపించి, నివాళి అర్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉంది. జూబ్లీహాలులో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. - డాక్టర్ కె.వి. కృష్ణకుమారి

Monday, February 14, 2011

యూత్ మంత్ర భగవద్గీత

"భగవద్గీత 'డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్'. సంతృప్తి, సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. చిన్న వయసులోనే అది జరగాలి'' అంటున్నారు జయారో. బయాలజీ చదువుకుని భగవ ద్గీత ప్రవచనాలను తన కెరీర్‌గా మార్చుకున్న జయారో విశాఖపట్నంలో ప్రసంగాలివ్వడానికి వచ్చినప్పుడు 'నవ్య' కలిసింది. "2030కల్లా మన దేశ జనాభాలో 55 శాతం మంది యువతే ఉంటారు. వాళ్లంతా పాతికేళ్లలోపువారు. వారు విజ్ఞానవంతులయితేనే దేశం పురోగమిస్తుంది.

వారు మంచి వ్యక్తిత్వంతో ఎదగడానికి, విశిష్టమైన వ్యక్తులుగా రూపుదిద్దుకోవడానికి భగవద్గీత అడుగడుగునా సాయపడుతుంది. అందుకే నేను నా పూర్తి సమయాన్ని గీతా ప్రవచనాలకే కేటాయిస్తున్నా''నంటున్న జయారోకు ఆ రంగంలో ముప్ఫయ్యేళ్ల అనుభవం ఉంది. దాంతో ఆమె స్థాపించిన 'వేదాంత విజన్' ట్రస్ట్ దేశవిదేశీయులు భగవద్గీతను సరైన అర్థంలో గ్రహించడానికి పనిచేస్తోంది. జయారో మూలాలు కర్ణాటకలో ఉన్నాయి. అయితే ఆమె పుట్టి, పెరిగిందంతా ముంబై నగరంలోనే.

మైక్రోబయాలజీలో పట్టా పుచ్చుకున్న ఆమె ఎనిమిదేళ్ల పాటు ఒక ఫార్మా సంస్థలో పనిచేశారు కూడా. "చిన్నప్పుడే మా అమ్మమ్మ, తాతయ్యలు నాకు భగవ ద్గీతను బోధించారు. పురాణాలూ, శాస్త్రాలను విపులంగా చెప్పేవారు. రోజూ ఒకేలా గడపడం బోర్, ఏదైనా వినూత్నంగా చెయ్యమని వాళ్లు చెప్పేవారు. పెరిగిన వాతావరణ ప్రభావమేమో మరి, ఫలితం - ఏదో సాధించాలన్న తపన నాలో రగిలింది. సంప్రదాయ సంగీతం, సాహిత్యాల పట్ల ఆసక్తి పెరిగింది. ఫార్మా పరిశ్రమలో నేను మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్‌ని.

నేను భగవద్గీతను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఎంతో విజయవంతమయ్యాను. దాన్నే ఇతరులకు అందించాలని ప్రయత్నిస్తున్నాను'' అంటున్నారామె. 'నేను ఆత్మికంగా ఎదగాలి, దేశానికి సేవచేయాలి' అనేదే నా ధ్యేయం. దానికి నేనెంచుకున్న మార్గం ఇది' అనే జయారో తన ఇరవైల్లో భగవద్గీత గురించి ప్రవచనాలిస్తున్నప్పుడు చాలామంది విచిత్రంగా చూసేవారు. "ఇదివరకు నా ప్రసంగాలకు వృద్ధులే ఎక్కువగా వచ్చేవారు, ఇప్పుడు యువతరమే వస్తున్నారు'' అని ఉత్సాహంగా చెప్పారామె.

అందరూ గొప్పగా ఎదగగలరు
ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని ఆధునిక పోకడలో యువతకు అందించడంలో జయారోది అందెవేసిన చెయ్యి. విశాఖలో చేసిన ప్రసంగంలో దాదాపు ఆరు వందల మంది పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ "మీరు నైకీ టీషర్టులు వేసుకుని తిరిగితే ఆ బ్రాండ్‌కి ప్రచారం. దానికి ప్రచారకర్తగా ఉండటానికి మీరే కొంత డబ్బు చెల్లించి మరీ ఆ టీషర్టును కొంటున్నారు. మీ వీపు మీద దాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. అయినా మిమ్మల్ని చూసి మరొకరు దాన్ని కొంటారనేమీ లేదు. అదే సంస్థలు తమ బ్రాండ్‌ను విస్తరించడం కోసం మిమ్మల్ని అభ్యర్థించే స్థాయికి మీరు ఎదగాలి.

ఆ ఉత్పత్తులను వాడటానికి అవి మీకు తిరిగి భారీ పారితోషికాలివ్వాలి. విశిష్టమైన వ్యక్తిగా ఎదగడం అంటే అదే...'' అని చెప్పారు. ఇలా సరళమైన ఉదాహరణలతో స్ఫూర్తిదాయకంగా సాగిన ప్రసంగం ముగిసిన తర్వాత విద్యార్థులకేం అర్థమైందో మూడు నాలుగు వాక్యాల్లో రాసివ్వమంటే తలా ఒక తీరున రాశారు. 'వీ షుడ్ నాట్ యూజ్ బ్రాండ్స్. ఎ బ్రాండ్ షుడ్ కమ్ టూ మీ' అని పదేళ్ల పిల్లాడు రాసిన వాక్యాల్లో వ్యక్తమైన ఆత్మవిశ్వాసం ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినా రాదేమో. 12-15 మధ్య వయసున్న పిల్లల కోసం జయారో 'ఎర్లీ ఫౌండేషన్ - ఎక్సెలెంట్ ఫ్యూచర్స్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.

యానిమేషన్, కథలతో సరదాగా సాగే ఆ కార్యక్రమం ద్వారా వారికి నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాలు, క్రమపద్ధతిని అలవర్చుకోవడం వంటివి మనసుకు హత్తుకుపోయేలా చెబుతారు. 16-25 వయసున్న వారికి జయారో 'స్ట్రాంగ్ ఫౌండేషన్స్ - సక్సెస్‌ఫుల్ ఫ్యూచర్స్' అనే మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బలమైన విలువల పునాదిపైనే బలమైన వ్యక్తిత్వం నిలబడుతుందని చెబుతూ మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి తమలోని ప్రతిభకు ఎలా పదునుపెట్టుకోవాలో యువతరంగాలకు తెలియజేస్తుందీ కార్యక్రమం. అందుకే విశాఖనగరం జయారో ప్రవచనాలకు మంత్రముగ్ధమయింది, తనలో కొత్త ఉత్సాహాన్ని నింపుకొంది.

సంతోష రహస్యం
భగవ ద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు' అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే 'భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది - మనం దాని జోలికి పోవద్దు' అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ అంటారామె. సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్ కావాలి, కావాలి... అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు.

అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అంటూ గీతాసారాన్ని సరళంగా అందిస్తారామె. ప్రశాంత మార్గాన్ని చెబుతూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి అంటారు జయారో.

- అరుణ పప్పు