జీవితానికి తృప్తి అవసరం.
అది పొందే తీరు బట్టే మన జీవన గమనం ఉంటుంది.
తృప్తి అనేది సంపాదించే సంపదమీద ఆధారపడి ఉండదు.
ఆ సంపాదించే తీరు ఫై ఆధారపడి ఉంటుంది.
Monday, October 12, 2009
కర్మ
కర్మ సిద్ధాంతాన్ని మించినది లేదు.
మనం నాటిన విత్తనాన్నిబట్టే ఫలాలున్నట్టు,
మనం చేసే పనుల బట్టే మన జీవిత ఫలితాలుంటాయి.
మంచి భావాలకు మనసులో స్థానమిస్తే,
మన చుట్టూ మంచితనం పరిమళిస్తుంది.
మనం నాటిన విత్తనాన్నిబట్టే ఫలాలున్నట్టు,
మనం చేసే పనుల బట్టే మన జీవిత ఫలితాలుంటాయి.
మంచి భావాలకు మనసులో స్థానమిస్తే,
మన చుట్టూ మంచితనం పరిమళిస్తుంది.
సీఎం పేషీలో... అగర్వాల్ అరాచకం

ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓ రాజ్యాంగేతర శక్తి ఇష్టారాజ్యంతో సీనియర్ ఐఏఎస్ అధికారులు అవమానాల పాలవుతున్నారు. పదవీ విరమణ చేసిన సలహాదారుకు, అధికారులకు మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. పదవీ విరమణ చేసిన అధికారుల హవా ముందు తమ ప్రతిభ ఎందుకూ పనికిరాకుండా పోతోందని వ్యక్తం చేస్తున్నారు. చివరకు ముఖ్యమంత్రి చేయవలసిన సమీక్షలు కూడా పదవీ విరమణ చేసిన అధికారే నిర్వహించడం, తనకు సంబంధం లేని శాఖల వ్యవహారాలు కూడా సదరు సలహాదారే చూస్తుండటంతో ఆయా శాఖల్లో పనిచేయడం తమ వల్ల కాదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియకుండానే, సలహాదారు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.
ముఖ్యమంత్రి కార్యాలయంలో వివిధశాఖలకు బాధ్యులుగా ఉన్న ముఖ్య కార్యదర్శులను సీఎం సలహాదారు పి.కె.అగర్వాల్ కరివేపాకుల్లా తీసి పడేస్తున్నారని, అన్ని శాఖల్లోనూ జోక్యం చేసుకుని తమను అవమానిస్తున్నారన్న ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఈ వైఖరితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా, పేషీలోని ముఖ్య కార్యదర్శులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గతంలో సీఎం పర్యటనలు, విదేశీ-స్వదేశీ ప్రముఖుల భేటీలు, ప్రాజెక్టుల సమీక్షలు, ప్రారంభోత్సవాలకు సంబంధించిన కీలక అంశాలన్నీ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన దినేష్‌కుమార్ చూసేవారు.

ఆయన వాటిని సమర్థవంతంగానే నిర్వహించారు. ఆ తర్వాత పదవీ విరమణ చేసిన అగర్వాల్‌ను ముఖ్యమంత్రి సలహాదారుగా నియమించడంతో వివాదం మొదలయింది. వ్యాపారవర్గానికి చెందిన అగర్వాల్‌ను సలహాదారుగా నియమించడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎలాంటి అనుభవం లేని, రాష్ట్రానికి చెందిన అధికారులతో ఎలాంటి సంబంధాలు లేని అగర్వాల్‌ను సలహాదారుగా నియమించడం వెనుక సామాజికవర్గ ప్రయోజనాలు, సంబంధాలున్నాయన్న విమర్శలు బీసీ అధికారుల నుంచి వినిపించిన విషయం తెలిసిందే. కాగా, సలహాదారుగా వచ్చిన అగర్వాల్‌కు అంతకుముందు దినేష్‌కుమార్ చూసిన బాధ్యతలు అప్పగించారు.
అప్పటి నుంచీ పేషీలో అగర్వాల్ అధిపత్యం పెరిగిందని, తనకు సంబంధం లేని అంశాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు అధికారుల నుంచి వినిపిస్తున్నాయి. చివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహారాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య మరెవరూ అనుసంధాన కర్తలు గానీ, వారి మధ్య మరే అధికారి గానీ జోక్యం చేసుకోకూడదన్న నిబంధనను కూడా అగర్వాల్ ఉల్లంఘిస్తున్నారని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధాన కార్యదర్శికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా సలహాదారు జోక్యం చేసుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. దీనిపై ఐఏఎస్‌లలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల ముఖ్యమంత్రి రోశయ్య బాబ్లీపై ప్రధానితో భేటీ కోసం ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా.. ఆయనతో పాటు సాగునీటి శాఖ వ్యవహారాలు చూసే ముఖ్యకార్యదర్శి శర్మ కూడా వెళ్లారు. అయితే, సలహాదారు ఆయనను ప్రధాని వద్దకు వెళ్లకుండా ఆపి, తానే భేటీకి వెళ్లిన వైనం అధికారవర్గాల్లో నాడే చర్చనీయాంశ మయింది. ఈ వైఖరిపై ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముక్కుసూటిగా వ్యవహరించే ఆ అధికారి ఆ సంఘటనతో మనస్తాపానికి గురయినట్లు ప్రచారం జరిగింది.
అదేవిధంగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన కోర్టు వ్యవహారంపై సమీక్షను సంబంధిత శాఖ కార్యదర్శి ప్రమేయం లేకుండా నిర్వహించిన తీరు విమర్శలకు గురయింది. తాను సమీక్ష నిర్వహించి, సాగునీటి శాఖ అధికారి టక్కర్‌ను నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. సంబంధిత శాఖ కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్ ఉన్నప్పటికీ ఆయనతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుకోవడంపై నిరసన వ్యక్తమయింది. తాము లేకుండానే తమ శాఖకు సంబంధించిన సమీక్షలను నిర్వహిస్తుంటే ఇక తాము ఆ శాఖలో ఉండి ఏమి ప్రయోజనమని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యమంత్రి రోశయ్యకు వెళుతున్న ఫైళ్లు కూడా సలహాదారు ముందుగా పరిశీలిస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. రోశయ్య కంటే ముందుగానే ఆయా శాఖల సమీక్షలు నిర్వహిస్తుండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రెవిన్యూ అంశాలకు సంబంధించి సలహాదారు ‘చాలా ఉత్సాహంగా’ పనిచేస్తున్నారని, మిగిలిన పెండింగ్ ఫైళ్లు చాలా ఉన్నప్పటికీ రెవిన్యూకి సంబంధించిన ‘భూముల ఫైళ్ల క్లియరెన్సులో మాత్రం ఆయన శరవేగంగా పనిచేస్తున్నారని’ అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.
సీఎం పేషీ బ్రోకర్ల మయంగా మారిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత గోనె ప్రకాశరావు ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారులు-సలహాదారు మధ్య జరుగుతున్న యుద్ధానికి ప్రాధాన్యం ఏర్పడింది.ఇదిలాఉండగా, తమకు సలహాదారు నుంచి ఎదురవుతున్న అవమానపర్వంపై రగిలిపోతున్న ముఖ్య కార్యదర్శులు ఆ విషయాన్ని సీఎంతో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.వారితోపాటు.. వివిధ శాఖలకు సంబంధించి కార్యదర్శులు కూడా జత కానున్నట్లు తెలుస్తోంది.సలహాదారు తమ పనిలో జోక్యం చేసుకోకుండా చూడాలని, ఆయన పెత్తనం ఇలాగే కొనసాగితే తాము పనిచేయడం కష్టమని ముఖ్యమంత్రికి స్పష్టం చేయనున్నట్లు అధికారవర్గాల సమాచారం.
Subscribe to:
Posts (Atom)